విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' చిత్రం జూలై 31, 2025న విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ డ్రామాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 45 కోట్ల రూపాయల బాక్సాఫీస్ టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.

130 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నెట్ ఫ్లిక్స్సినిమా డిజిటల్ హక్కుల కోసం ఏకంగా 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సమాచారం అందుతోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచడానికి ఆమోదం తెలిపింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్ టికెట్లపై రూ. 75 పెంపు ఉంటుంది.

తిరుపతిలో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.  విజయ్ దేవరకొండ మాట్లాడుతూ  సినిమాల విషయంలో తన సోదరుడు ఆనంద్  దేవరకొండకు సలహాలు, సూచనలు ఇవ్వనని వెల్లడించారు.  నా కొడుకు విషయంలో సైతం  నేను ఇలానే ఉంటానని  ఆయన పేర్కొన్నారు.  ఫలానా మూవీ చేస్తున్నాని ఆనంద్ నాకు చెబుతాడని  అంతే  తప్ప కథ గురించి కానీ దర్శకుడి గురించి కానీ అడగనని  ఆయన  అన్నారు.

ఆనంద్ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడని నేను అనుకుంటానని  నటుడిగా ప్రయాణం ఎంత కష్టమో  నాకు తెలుసనీ  అందుకే ఇతర విషయాలు పట్టించుకోనని ఆయన తెలిపారు.  నీపై నీకు నమ్మకం ఉంటే  మాత్రమే  ఇండస్ట్రీలోకి రావాలని లేదంటే రావద్దని ముందే చెప్పానని  విజయ్ దేవరకొండ చెప్పారు. విజయ్ చెప్పిన ఈ విషయాలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ రేంజ్ అంతకంతకూ  పెరుగుతుండటం గమనార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: