
అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని ఈ వీడియో షేర్ చేయడం వల్ల చాలామంది ఫోన్ చేసి మరీ ఇంటర్వ్యూలు అడుగుతున్నారని తెలియజేసింది హీరోయిన్ తను శ్రీ దత్తా. కొన్నేళ్లుగా తాను ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడిపోవడం వల్ల మీడియా ముందుకు ఎక్కువగా రావడం లేదని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల తాను ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తోందని నాకు అందరితో మాట్లాడాలని ఉంది. అందుకోసం కొంత సమయం పడుతుంది. దయచేసి ప్రశాంతంగా ఉండండి అంటూ తెలిపింది.
బాలీవుడ్ లో మాఫియా ముఠా చాలా పెద్దదిగా ఉంది. ముంబైలో తన ప్రాణానికి ముప్పు ఉందని.. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాగే తన ప్రాణం కూడా తీయాలని చూస్తున్నారని.. అవకాశం వస్తే మళ్లీ సినిమాలు చేయాలని కోరిక ఉన్నదని గతంలో తెలియజేసింది. అప్పట్లో హీరో ఇమ్రాన్ హస్మితో కలిసి చేసిన ఆశిక్ బనాయా ఆపనే చిత్రం ఎంతటి పాపులారిటీ సంపాదించకుంది.. ఇందులో ఇమ్రాన్ హాస్మితో కలిసి తను శ్రీ దత్తా చేసిన రొమాన్స్ హైలెట్ గా ఉంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన తను శ్రీ దత్తా. టాలీవుడ్ లో వీరభద్ర సినిమాలో కూడా నటించింది.2013 తర్వాత ఇండస్ట్రీకి దూరమై క్యాస్టింగ్ కౌచ్ మీటూ ఉద్యమం మీద గొంతు లేపింది.