
పీరియడ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. వీరమల్లు పేదల నుండి దోచుకున్న సంపదను తిరిగి ఇచ్చే ఒక రాబిన్ హుడ్ లాంటి పాత్ర కాగా ఫస్టాఫ్ బాగున్నా సెకండాఫ్ విషయంలో పొరపాట్లు జరగడంతో ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేదని చెప్పవచ్చు. జానపద కథలు, యాక్షన్ మరియు ఫాంటసీ అంశాలను మిళితం చేసిన ఈ సినిమా కలెక్షన్లు నిరాశాజనకంగా ఉన్నాయి.
అయితే ఈ సినిమా పైరసీ బారిన పడగా జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ సినిమా కలెక్షన్లను ఆపలేరని అన్నారు. ఈ సినిమా 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో పైరసీ గురించి డీఎస్పీకి కిరణ్ రాయల్ ఫిర్యాదు చేయగా ఆ తర్వాత ఈ సినిమా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పవన్ అన్నా భయమేనని పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నా భయమేనని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కాక పవన్ సినిమాల గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు. వైసీపీ మాజీ మంత్రులు చేస్తున్న దుష్ప్రచారం గురించి కిరణ్ రాయల్ ఘాటుగా స్పందించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.