
మరీ ముఖ్యంగా వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయి అంటూ చాలా ట్రోల్ చేశారు ఆకతాయిలు. కొంతమంది పవన్ ఫ్యాన్స్ కూడా విఎఫ్ఎక్స్ ఎఫ్ఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయి అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. అయితే గతంలో ప్రభాస్ సైతం ఇదే సమస్యతో బాధపడ్డాడు . ఆయన నటించిన ఆది పురుష్ సినిమా విషయంలోనూ ఇదే ట్రోలింగ్ జరిగింది . సినిమా లో ప్రభాస్ రాముడు క్యారెక్టర్ లో కనిపిస్తాడు . ఈ సినిమాలో వి ఎఫ్ ఎక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి అంటూ రెబెల్ స్టార్ ప్రభాస్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు ఆకతాయిలు.
పాన్ ఇండియా స్టార్ అని కూడా చూడకుండా హ్యూజ్ ట్రోలింగ్ చేశారు . అప్పుడు ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాకి ఆయన ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యారో ఇప్పుడు "హరిహర వీరమల్లు" సినిమా విషయంలో కూడా విఎఫ్ఎక్స్ కారణంగా పవన్ కళ్యాణ్ అండ్ టీం ఇదేవిధంగా ట్రోలింగ్కి గురవుతున్నారు. ఇప్పటికి సోషల్ మీడియాలో అడపదడపా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయ్. పవన్ కళ్యాన్ లాంటి బిగ్ హీరోకి కూడా ఈ సమస్యలు తప్పలేదు అంటూ సినీ ప్రముఖులు సైతం మాట్లాడుకుంటున్నారు..!!