
ఈ సినిమా కోసం బాలీవుడ్ జనాలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తెలుగు జనాలు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమాలో నటించడం ఎన్టీఆర్ కు బిగ్ మైనస్ గా మారిపోతుంది అంటున్నారు. ఎన్టీఆర్ ని పాజిటివ్ షేడ్స్ లో చూస్తేనే ఫ్యాన్స్ లైక్ చేస్తారు అని.. నెగిటివ్ షేడ్స్ లో చూస్తే అస్సలు లైక్ చేయరు అని .. పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఈ విధంగా నెగిటివ్ షేడ్స్ చేయడం ఆయన కెరీర్ కి బిగ్ మైనస్ గా మారబోతుంది అంటూ ఈ కథ ఒప్పుకున్న కొత్తల్లోనే టాక్ వినిపించింది .
ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో థియేటర్లో ఈ వార్ 2 సినిమా రిలీజ్ కాబోతుంది . ఇప్పటి వరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా హృతిక్ రోషన్ కి ఫేవర్ గానే ఉన్నాయి. తారక్ ని నెగిటివ్ గా చూపిస్తున్నారు తప్పితే ఎక్కడ హైలెట్గా చేయడం లేదు . తెలుగు ఇండస్ట్రీలో వార్ 2 సినిమా పై టాక్ కూడా అలానే వినిపిస్తుంది . దీంతో ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఫ్లాప్ అయితే బాలీవుడ్ లో ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి ..? ఇక ఆయనని నమ్మి మరొక డైరెక్టర్ అవకాశం ఇస్తాడా..? తెలుగులో పెద్ద హీరో ఆయన.. ఎందుకు బాలీవుడ్ లో విలన్ గా చేస్తున్నాడు . తర్వాత ఇండస్ట్రీలో ఆయన స్థానం నిలుపుకోగలడా..?? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు జనాలు..!!