
ఇక అందుకే తొలిరోజు మొదటి షో చూడాలనుకుంది. కానీ ఆమె వస్తే అభిమానుల రద్దీ, హంగామా, సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని కలిసి థియేటర్ వాతావరణమే డిస్టర్బ్ అవుతుందని మేము చెప్పాం,” అని వంశీ చెప్పారు . కానీ రష్మిక తన ఊహలకు మించిన ప్లాన్ వేసింది. వేషం మార్చుకుని, మామూలు జనాల్లో కలిసిపోయి భ్రమరాంబ మరియు మల్లికార్జున థియేటర్‌లలో సినిమాను చూసేసిందట. ఎవ్వరికీ తెలియకుండా మాస్క్, గాగుల్స్, క్యాపుతో ఓ డిఫరెంట్ లుక్‌లో వచ్చిందట. తనకు ‘కింగ్‌డమ్’ ఎంత సంతోషం ఇచ్చిందో, థియేటర్ వాతావరణంలో చూస్తేనే తెలుసు అంటోంది. ఇది తెలియగానే విజయ్ ఫ్యాన్స్ మస్తుగా ఫుల్ ఖుష్ అయ్యారు.
సోషల్ మీడియాలో #RashmikaKingdomSupport అంటూ ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. మరికొందరు కామెంట్ చేస్తున్నారు – "ఇదే నిజమైన సపోర్ట్! అభిమానుల్లా సినిమా చూసే స్టార్‌హీరోయిన్ వెరే లెవల్!" రష్మిక – విజయ్ మధ్య రిలేషన్‌షిప్ ఎప్పుడూ హాట్ టాపిక్ అయినప్పటికీ, వాళ్లిద్దరూ క్లారిటీ ఇవ్వరు. కానీ ఇలా చేసింది మాత్రం అభిమానుల్లో మరో హైప్ తీసుకొచ్చింది. సినిమాకు మద్దతుగా రష్మిక వేసిన డిస్‌గైజ్ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి రష్మిక ప్లాన్ వర్కౌట్ అయ్యింది. విజయ్ సినిమాకి థియేటర్‌లోనే జై కొట్టింది. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం అంటున్నారు – 'రియల్ లవ్ అంటే ఇదే కావచ్చు!