
మొదటినుంచి ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ చిత్రం పైన మరింత ఆసక్తి పెంచేలా చేస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయగా అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా మరొక అప్డేట్ ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని ఆగస్టు 7వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు. ప్రేతభయం కంటే ముందుగా ప్రేమనే పరిచయం చేయబోతున్నామనే ట్యాగ్ లైన్ తో ఒక సాంగ్ ప్రివ్యూని పంచుకున్నారు.
ఇది ఆడియన్స్ ని మరింత ఆకట్టుకునేలా చేయడమే కాకుండా మరింత ఎక్సైటింగ్ అయ్యేలా చేస్తోంది. ఈ సినిమాకి సంగీతాన్ని సామ్ సీఎస్ అందిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ ఇప్పటినుంచి సినిమా అప్డేట్లను మాత్రం ప్రకటిస్తామంటూ తెలియజేశారు. ప్రస్తుతం కిష్కింధపురి సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నట్లుగా సమాచారం. మ్యూజికల్ ప్రమోషన్స్ తో పాటుగా సరికొత్త అప్డేట్లను కూడా ఇచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా హీరోగా సరైన సక్సెస్ అందుకోలేక చాలా సతమతమవుతున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.