
ఈ హోటల్ లోని హైలెట్స్ ఏంటంటే అరిట ఆకులో భోజనం వడ్డిస్తారు . అంతేకాదు మనం ఏదైనా పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు.. మన బంధువులు కొసరు కొసరు అడిగి వడ్డిస్తారే.. ఆ విధంగా వడ్డిస్తారు. మరీ ముఖ్యంగా తెలుగింటి సంప్రదాయ రుచులు అన్నిటిని రుచి చూపిస్తారు . నెయ్యి, కారం పొడులు, ముద్దపప్పు , ఆంధ్ర ట్రెడిషనల్ వంటకాలలో బూరెలు .. ఇలా రకరకాల పిండి వంటలతో పచ్చళ్ల తో వేపుళ్ళతో పక్కా ఆంధ్ర భోజనాన్ని రుచి చూపిస్తారు . సుబ్బయ్య గారి హోటల్లో అందరికీ బాగా నచ్చింది గీ పొడి అన్నం.
సింపుల్ మిల్సే కానీ చాలా చాలా రుచికరంగా ఉంటుంది. మొత్తం హోమ్ స్టైల్. ఇప్పటివరకు ఈ భోజనం పై ఒకరంటే ఒక్కరు కూడా నెగిటివ్ గా కామెంట్ ఇవ్వలేదు . అయితే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇలాంటి హోటల్స్ కి రావడానికి ఇష్టపడరు . వాళ్లంతా లగ్జరీ హోటల్స్ లో భోజనం చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్ మాత్రం చాలా సింప్లిసిటి మెయింటైన్ చేస్తుంది. ఆ కారణంగానే అనుపమ పరమేశ్వరన్ కాకినాడలో భోజనం బాగుంటుంది అనే ఉద్దేశంతో తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కడికి వెళ్ళిన సమయంలో అడిగి మరీ సుబ్బయ్య గారి హోటల్ కి వెళ్లి భోజనం చేసింది .
దాని గురించి రివ్యూ కూడా ఇచ్చింది . అనుపమ పరమేశ్వరన్ నటించిన "పరదా" సినిమా ఈనెల 22వ తేదీ గ్రాండ్గా విడుదల కాబోతుంది . ఈ క్రమంలోనే కాకినాడ నగరానికి ప్రచారం కోసం వచ్చిన ఆమె స్థానిక సుబ్బయ్య హోటల్ ఫుడ్ గురించి తెలుసుకున్నారు . ఎప్పటినుంచో తినాలి అనుకుంటున్నారు . ఆ కారణంగానే హోటల్ కి వెళ్లి మరి ఆ భోజనాన్ని ఆస్వాదించారు . భోజనం తిన్న తర్వాత ఆమె ఇచ్చిన రివ్యూ అద్దిరిపోయింది . చాలా బాగున్నాయి అని ..ప్రతి వంట అదిరిపోయే రేంజ్ లో ఉంది అని.. మరీ ముఖ్యంగా అడిగి అడిగి వడ్డించడం ఇంకా బాగుంది అంటూ ఆమె తెలిపారు . అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా ఫోటోలు దిగారు . నిజానికి స్టార్ హీరోయిన్స్ ఇలా చేయరు. కానీ ఆమె అందరితో చాలా నవ్వుతూ మాట్లాడారు. దీంతో అక్కడ ఉండే వారు షాక్ అయ్యారు. సినిమా దర్శకుడు ప్రవీణ్ నిర్మాత శ్రీధర్ కూడా అనుపమతో పాటు ఆ హోటల్లో భోజనం చేశారు.