ర‌వితేజ అంటేనే మాస్ హీరో అని సినిమా ప్రియులు చెప్పుకునే విధంగా, ఆయన సినిమాలు ఎప్పుడూ ఎనర్జీ, ఎంటర్టైన్‌మెంట్, హై వోల్టేజ్ యాక్షన్‌తో నిండిపోతుంటాయి. అదే ఫార్ములాను మళ్లీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది ‘మాస్ జాతర’. టైటిల్‌లోనే మాస్ అనే పదం ఉండటంతోనే ప్రేక్షకులు ఏ తరహా సినిమా అనేది ముందుగానే ఊహించేశారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించింది. ఆగస్టు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే, కొత్తదనం కన్నా రవితేజ స్టైల్ మాస్ మసాలాకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపిస్తోంది. హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌లోనే బిల్డప్ షాట్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ర‌వితేజ రైల్వే పోలీస్‌గా కనిపించబోతున్నారు. గ‌తంలో చాలా సినిమాల్లో పోలీస్‌గా చేశారు. లుక్ అయితే క్రాక్ సినిమాను గుర్తు చేస్తోంది.


సేమ్ కామెడీ టైమింగ్, సేమ్ మాస్ యాక్షన్ మిక్స్ చేశారు. శ్రీలీలా హీరోయిన్‌గా కనిపించనుండగా, రొమాన్స్ ట్రాక్ కూడా పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలా ఉంది. ధ‌మాకా సినిమా స్టైల్లోనే వీరి మ‌ధ్య రొమాంటిక్ సీన్లు ఉన్న‌ట్టుగా ఉంది. ఇక డైలాగుల విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న వైరల్ డైలాగులు లేదా సోషల్ మీడియా బజ్‌లో ఉన్న పంచ్‌లను వాడుంటే మరింత కనెక్ట్ అయ్యేదని అనిపిస్తోంది. అక్క‌డ కూడా కొత్త‌ద‌నం ఏ మాత్రం లేదు.
మొత్తానికి ‘ మాస్ జాతర ’ ట్రైలర్ రవితేజ అభిమానుల కోసం పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ రాబోతుందనే సిగ్న‌ల్స్ ఇస్తున్నా ఏ మాత్రం కొత్త‌ద‌నం ఉండ‌ద‌ని.. కేవ‌లం ర‌వితేజ మార్క్ మాస్ మ‌సాలా సినిమా అనే స్ప‌ష్టంగా క్లారిటీ ఇచ్చేసింది. 27న మాస్ ఆడియెన్స్‌కి ఈ జాతర ఎంతగా నచ్చుతుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: