ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు సినిమాల ప్రాణం. కానీ కాలం మారింది … ఇప్పుడు పరిస్థితి పూర్తి రివర్స్ ! హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్‌ల సంఖ్య 20 ఏళ్ల క్రితం తో పోల్చితే సగం కూడా లేదు. ఉన్నవీ ఎప్పుడో మూతపడే దిశగా వెళ్తున్నాయి. కారణం ఒక్కటే – మల్టీప్లెక్స్ క్రేజ్. మల్టీప్లెక్స్‌ల్లో లగ్జరీ సీటింగ్, ప్రీమియం సౌండ్, క్లారిటీ ఉన్న స్క్రీన్, ఎయిర్ కండీషన్ … మొత్తం సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ సూపర్. అందుకే ప్రేక్షకులు ఇప్పుడు సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్‌కే వెళ్తున్నారు. నెలలో ఒకసారైనా, ఎన్నిసార్లైనా మల్టీప్లెక్స్‌కి వెళ్లడం ఇప్పుడు చాలా మందికి అలవాటు. ఈ క్రేజ్‌ని బిజినెస్‌గా మార్చుకోవడానికి పీవీఆర్ , ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ చైన్స్ దూసుకెళ్తున్నాయి.


ఇటీవల వనస్థలిపురంలో రవితేజ మల్టీప్లెక్స్ ఓపెన్ అయి మంచి స్పందన పొందింది. ఇప్పుడు అదే తరహాలో ఇనార్బిట్ మాల్, హైదరాబాద్లో పీవీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. అధికారిక ప్రకటన ప్రకారం – ఈ మల్టీప్లెక్స్‌లో ఏకంగా 11 స్క్రీన్స్ ఉండబోతున్నాయి! అంతే కాదు, ప్రీమియం లార్జ్ ఫార్మాట్ PXL కూడా ఇక్కడే అందుబాటులోకి రానుంది. ఇనార్బిట్ మాల్ అంటే హైదరాబాద్‌లోనే ప్రైమ్ ఏరియా. రోజూ వేలమంది షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వస్తారు. చుట్టుపక్కల డజన్ల సంఖ్యలో ఐటీ కంపెనీలు, ఆఫీసులు ఉన్నాయి. ఈ కారణంగా పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు రిస్పాన్స్ మామూలుగా ఉండదనే చెప్పాలి.



సినిమా రిలీజ్ అయితే “మల్టీప్లెక్స్‌లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో” అనే మెంటాలిటీ ఇప్పుడు యూత్‌లో ఎక్కువ. అందుకే పీవీఆర్ వారు స్క్రీన్‌ల సంఖ్యను ఎక్కువ చేస్తూ, ఎప్పుడూ హౌస్‌ఫుల్‌గా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్స్ , స్పెషల్ షోలు , ఫెస్టివల్ రిలీజ్‌లకు ఈ మల్టీప్లెక్స్ హాట్ స్పాట్ అవుతుందనడంలో సందేహమే లేదు.మొత్తానికి , హైదరాబాద్ సినిమా లవర్స్‌కి ఇది ఒక బిగ్ గిఫ్ట్. ఇకపై 70MM మాజిక్‌ను సింగిల్ స్క్రీన్‌లో మిస్సవుతున్నా, మల్టీప్లెక్స్‌లో లగ్జరీతో సినిమాను ఆస్వాదించే అవకాశం మరింత పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: