ప్రభాస్ కి కాబోయే భార్య అది కూడా హీరోయిన్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అనుష్కశెట్టి మాత్రమే.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం అనుష్క శెట్టి కాదు.ఆమె ప్రభాస్ కి కాబోయే భార్య అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఆ హీరోయిన్ కి శ్యామలాదేవి దీవెనలు కూడా అందాయి అని.. నెక్స్ట్ ప్రభాస్ పెళ్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇంతకీ ప్రభాస్ ని కట్టుకోబోతున్న ఆ అదృష్టవంతురాలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రభాస్ పెళ్లి వార్తలు విని విని చాలా బోర్ కొడుతుంది.అభిమానులకే కాదు మిగతా హీరోల అభిమానులకు కూడా ప్రభాస్ ఇక పెళ్లి చేసుకోడు కావచ్చు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఎప్పుడు ఎక్కడ కనిపించినా కూడా మీడియా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అడుగుతుంది.

దీనికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఎప్పుడు ఒకటే కామన్ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది.ఈ ఏడాది పెళ్లి అని చెప్పుకుంటూ పోవడమే తప్ప ప్రభాస్ పెళ్లి జరిగింది లేదు మనం చూసింది లేదు. ఇక రీసెంట్ గా అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని మేము కూడా బలంగా కోరుకుంటున్నాం. కానీ ముహూర్త బలం రావాలి కదా.. ప్రభాస్ అనుకుంటే అన్ని జరిగిపోతాయి అంటూ స్పందించింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి దగ్గర ఒక హీరోయిన్ దీవెనలు తీసుకున్న ఫోటో వైరలౌతుంది. ఆ ఫొటోలో ఉంది ఎవరో కాదు నిధి అగర్వాల్..ఈమధ్య హరిహర వీరమల్లు మూవీ లో తన గ్లామర్ తో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవితో ఉన్న ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా శ్యామలాదేవి నిధి అగర్వాల్ తో మాట్లాడుతూ..నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అమ్మాయి అంటూ పొగిడింది.
అలాగే కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ.. కృష్ణంరాజుది మొగల్తూరు..ఆయనకి కూడా అదే అలవాటు అన్నట్లుగా మాట్లాడింది. అంతేకాకుండా నిధి అగర్వాల్ అందాన్ని పొగడడమే కాకుండా ఎప్పుడూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటూ వరుస అవకాశాలు అందుకోవాలని, నిర్మాతలు నీ డేట్స్ కోసం వెయిట్ చేయాలి అంటూ దీవించింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మనసుని నిధి అగర్వాల్ దోచేసింది అంటే మామూలు విషయం కాదు. వీరిద్దరికి పెళ్లి చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక మరికొంతమందేమో నిధి అగర్వాల్ ప్రభాస్ ఇద్దరికీ పెళ్లి జరగబోతున్నట్టు రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: