
అయితే … థియేటర్లలో పరిస్థితి వేరేలా ఉంది. బుక్ మై షోలో ట్రెండింగ్‌లో ఉన్నప్పటికీ, అది ఇండిపెండెన్స్ డే సెలవు ఫలితం. నార్త్ ఆడియన్స్‌కు ఆ రోజున పెద్దగా ఆప్షన్స్ లేకపోవడంతో వార్ 2 ఒకటే ప్రధాన ఎంపిక అయ్యింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మిశ్రమ స్పందనే వచ్చింది. ఓపెనింగ్ డే రికార్డు సాధిస్తుందనే అభిమానుల ఆశ నెరవేరకపోవడం నిరాశ కలిగించింది . ఇది మొదటిసారి కాదు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ఈవెంట్‌లో కూడా తారక్, అన్న కళ్యాణ్ రామ్ గురించి గొప్పగా మాట్లాడారు.
ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అప్పట్లోనూ ట్రోల్స్ వచ్చాయి. ఫ్యాన్స్ చెప్పే మాట ఒకటే – “సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎంత ఎలివేషన్ ఇచ్చినా పర్వాలేదు. కానీ రిలీజ్‌కి ముందు అతిశయోక్తితో మాట్లాడితే, యాంటీ ఫ్యాన్స్‌కి బైటా అవకాశం దొరుకుతుంది”.టెంపర్ తర్వాత ఫ్లాపే తెలియని తారక్‌కి టార్గెట్ చేసే గ్రూపులు ఎప్పటినుంచో ఉన్నాయనే మాట కూడా నిజమే. ఇంతకాలం వాటిని డాడ్జ్ చేసినా, వార్ 2తో వారికీ చాన్స్ ఇచ్చినట్టయింది. హైప్‌కి హద్దులు ఉండాలని, స్పీచ్‌లు సినిమాకి తోడ్పడాలని కానీ హానీ చేయకూడదని ఈ ఎపిసోడ్ మరోసారి రుజువు చేసింది .