టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో మల్లాడి వశిష్ట ఒకరు. ఈయన కేవలం ఇప్పటివరకు బింబిసారా అనే ఒకే సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమానే మంచి విజయాన్ని అందుకోవడంతో దర్శకుడిగా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈయన చాలా కాలం క్రితమే మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. కానీ ఈ సినిమాకు అత్యంత భారీ గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఈ సినిమా చాలా లేట్ అవుతూ వస్తోంది. ఈ మూవీ ని చాలా కాలం క్రితం ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఆ తర్వాత ఈ మూవీ విడుదలను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు సంబంధించి మరో అధికారిక ప్రకటన వెలబడలేదు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వశిష్ట మాట్లాడుతూ ... ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కొంత కాలం క్రితం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ మూవీ టీజర్ చాలా వరకు ప్రేక్షకులను , విమర్శకులను నిరుత్సాహ పరిచింది. ఇకపోతే ఆగస్టు 22 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అనే విషయం మనకు తెలిసిందే.

దానితో విశ్వంభర మూవీ నుండి మరో టీజర్ ను విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెండవ టీజర్ మొదటి టీజర్ మాదిరిగా కాకుండా ప్రేక్షకులను , విమర్శకులను అందరిని అద్భుతమైన రీతిలో మెప్పించే విధంగా ఉండబోతున్నట్లు , ఆ రేంజ్ లో వశిష్ట ఈ మూవీ టీజర్ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మూవీ రెండవ టీజర్ కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీ పై అంచనాలు తారా స్థాయికి చేరిపోయే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: