నాగార్జున కూలీ మూవీ లో విలన్ గా నటించడమే కాదు మెప్పించాడని చెప్పుకోవచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం నాగార్జున మరొక హీరో సినిమా లో విలన్ గా చేశాడంటే నిజంగా అద్భుతమే.. అయితే అలాంటి నాగార్జున జగపతి బాబు హోస్టుగా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో కి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ షో కి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఆగస్టు 17న రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన కొన్ని ప్రోమోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా నాగార్జున జగపతిబాబు కు సంబంధించి ఎవరికి తెలియని ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. 

మేమిద్దరం కలిసి సింగపూర్ హోటల్ లో అలా చేశామంటూ జగపతిబాబు బయటపెట్టిన ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు.. మరి ఇంతకీ నాగార్జున జగపతిబాబు కలిసి సింగపూర్ హోటల్లో ఏం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జగపతిబాబు జయమ్ము నిశ్చయమ్మురా షోలో నాగార్జున గురించి మాట్లాడుతూ.. నాగార్జున నేను ఓ రోజు సింగపూర్ లోని ఫైవ్ స్టార్ హోటల్లో దిగాము. అయితే పని మీద వెళ్ళిన సమయంలో మేము ఆ హోటల్ని అపరిశుభ్రం చేసాం. 

దాంతో హోటల్ యాజమాన్యం మా మీద కోప్పడి వెంటనే దాన్ని క్లీన్ చేయండి అంటూ మాప్ చేతికి ఇచ్చారు. అలా సింగపూర్ ఫైవ్ స్టార్ హోటల్లో మాప్ పట్టుకొని ఫ్లోర్ అంతా క్లీన్ చేశారు నాగార్జున అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టారు జగపతిబాబు. అయితే ఈ విషయం చెప్పిన తర్వాత నాగార్జున కూడా ఈ విషయం గురించి నాకు కూడా కొంచెం గుర్తుంది అంటూ చెప్పుకొచ్చారు.అయితే అంత పెద్ద హీరో అయి ఉండి నాగార్జున ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్లోర్ క్లీన్ చేయడం ఏంటి అని చాలామంది షాక్ అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: