అయిపోయింది… అంతా అయిపోయింది. ఇన్నాళ్లు వార్ 2, వార్ 2 అంటూ ఫ్యాన్స్ రెండు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ వేచిచూశారు. ఫైనల్‌గా ఆ సినిమా రిలీజ్ అయ్యింది. మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్ 2 సినిమా హిట్ అయినా, తెలుగులో మాత్రం అంత బాగా ఆడలేదు. ఫ్యాన్స్ నమ్మడానికి ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం అంటున్నారు జనాలు. ఎన్టీఆర్ నటించిన వార్ 2 రిలీజ్ అయింది. సినిమాపై ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగిన సీన్స్ లేవు అని సొంత ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు.


ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌కు సంబంధించిన మిగతా వార్తలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇన్నాళ్లు దేవర, దేవర అన్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయి అనుకున్నంత హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత వార్ 2, వార్ 2 అన్నారు. కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.ఇప్పుడు అందరి కళ్ళు ప్రశాంత్ నీల్–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చే డ్రాగన్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాల్సిందే. రిస్క్ తీసుకునే ఛాన్స్ లేదు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే, హ్యాట్రిక్ ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకున్నట్టవుతాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు, ఆయనకి ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.



ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను మరింత స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఈ సినిమా స్టోరీ పూర్తిగా డిఫరెంట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత్ నీల్–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న డ్రాగన్ సినిమాపైనే ఆసక్తి చూపిస్తున్నారు.దీనికి సంబంధించిన అప్డేట్స్ త్వరగా రిలీజ్ చేస్తూ, షూటింగ్ త్వరగా పూర్తిచేసి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో…???

మరింత సమాచారం తెలుసుకోండి: