
అయితే ఈ విషయాన్ని బాబీ డియల్ ఫిలింఫేర్ అవార్డు వేడుకలలో కూడా అందరి ముందు వెల్లడించారు. వాస్తవానికి ఇది పాత విషయమైనా తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారడంతో మరి ఆ హీరోయిన్ ఎవరో? ఆ సినిమా ఏంటా అని అభిమానులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మనిషా కొయిరాలా, కాజోల్, బాబీ డియోల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గుప్త్: హిడెన్ ట్రూత్ .. ఈ చిత్రం 1997లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో బాబి డియోల్, మనీషా కొయిరాల మధ్య ఒక రొమాంటిక్ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చేసే సమయంలో బాబి చాలా ఇబ్బందులు పడ్డారట. అప్పటి సంగతిని 2001 జరిగిన ఫిలింఫేర్ అవార్డులలో తెలియజేయడంతో ఈ విషయం ఒక సెన్సేషనల్ గా మారింది. మనీషా కొయిరా నోటి నుంచి గబ్బు వాసన వచ్చిందని అది తట్టుకోలేక ఆ సీన్ చేయలేకపోయానని తెలిపారు.. అసలు విషయంలోకి వెళితే మనీషా కొయిరాలతో కలిసి రొమాంటిక్ సీన్స్ చేస్తున్న సమయంలో ఆమె తన బుగ్గ కొరకాల్సి ఉండగా అప్పుడే ఆమె శనగల కూరతో పాటుగా ఉల్లిపాయతో భోజనం చేసిందని.. అలా ఆమె నోటి నుంచి ఉల్లిపాయ వాసన చాలా దారుణంగా వచ్చిందని.. ఆ ఉల్లిపాయల వాసనకి దీంతో ఆమెతో ముద్దు సన్నివేశం చేయలేనని డైరెక్టర్ కు చెప్పేసానని ఈ విషయాన్ని అందరి ముందు ఫన్నీగా చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు.