సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే పవర్ ఫుల్ స్టైల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున విలన్ పాత్రలో నటించగా ... సత్యరాజ్ , శృతి హాసన్ , ఉపేంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. ఆమీర్ ఖాన్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది.

అయిన కూడా ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాపడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లో 400 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ఓ టి టి స్ట్రీమింగ్ కి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు , అందులో భాగంగా ఈ మూవీ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు సెప్టెంబర్ 27 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన కేవలం తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ భాషలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు , ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ స్ట్రీమింగ్ తేది మరింత ఆలస్యం కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: