
ఈ క్రమంలోనే లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 సినిమాతో మళ్లీ తన పేరుకు పునర్వైభవం తీసుకువస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. నిజానికి కూలి ప్రమోషన్స్‌లో కూడా లోకేష్ కనగరాజ్ "ఖైది 2" నే నెక్స్ట్ సినిమా అని ఆయనే చెప్పుకొచ్చారు. కానీ రీసెంట్‌గా కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం లోకేష్ మొత్తం ప్లాన్ మార్చేశాడట. కూలి తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్‌లతో ఓ భారీ మల్టీస్టారర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడని వార్తలు బయటకొచ్చాయి. దీంతో “లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్‌లోనే సినిమాలు చేస్తే బాగుంటుంది” అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.
సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేస్తూ, “లోకేష్ కనగరాజ్ కి వచ్చిన నెగిటివిటీని పాజిటివిటిగా మార్చుకోవాల్సిన సినిమాలు చేయాలి కానీ, సినిమాటిక్ యూనివర్స్ అనే రిస్క్‌లు చేస్తూ పేరు పోగొట్టుకుంటున్నాడు” అని అంటున్నారు. జాగ్రత్తగా లేకపోతే కష్టమే అని, ఇండస్ట్రీలో చాలామంది స్టార్ డైరెక్టర్లు టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా, ఇప్పటి వరకు సంపాదించిన పేరు మొత్తం పోతుందని ఇండస్ట్రీ టాక్.మరి లోకేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మాత్రం ఆఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.