కొద్ది రోజులుగా సినిమా పరిశ్రమలో నెలకొన్న కార్మికుల వేతనాల వివాదం కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీనిపై ఫిల్మ్ ఫెడరేషన్, నిర్మాతల మండలి మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో పరిస్థితి మరింత జటిలమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. సమస్యను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి.
ఈ చర్చలలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వం చొరవతో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు మళ్లీ మొదలవుతాయని ప్రకటించారు. ఈ సందర్భంగా సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి మళ్లీ లభించనుంది. అంతేకాకుండా, నిలిచిపోయిన చిత్రాల నిర్మాణం తిరిగి ప్రారంభం కానుంది. ఈ పరిణామంతో తెలుగు సినిమా పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. అయితే రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడనున్నాయి. షూటింగ్స్ తిరిగి ప్రారంభం కానుండటంతో భారీ నష్టాలు తగ్గినట్టేనని చెప్పవచ్చు. సమ్మె ఇలాగే కొనసాగి ఉంటే మాత్రం నిర్మాతలు ఊహించని స్థాయిలో నష్టపోయేవారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి