సాయి పల్లవి.. ఈ న్యాచురల్ బ్యూటీ గురించి పరిచయాలు అక్కర్లేదు. నటిగా కెరీర్ ప్రారంభించిన చాలా తక్కువ సమయంలోనే సాయి పల్లవి భారీ స్టార్డమ్ సొంతం చేసుకుంది. అందం, అభినయం మరియు అదిరిపోయే డాన్సింగ్ స్టైల్ తో హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.. సామాన్యుల మాదిరిగానే సెలబ్రిటీలకు కూడా ఫేవరెట్ నటీనటులు ఉంటారు.


ఆ విధంగా టాలీవుడ్ లో సాయి పల్లవికి మోస్ట్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. చిరంజీవి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మరీ ముఖ్యంగా ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టమ‌ని సాయి పల్లవి పేర్కొంది. అయితే అంత ఇష్టమైన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే మాత్రం రిజెక్ట్ చేయడం గమన్నారం. ఇంతకీ సాయి పల్లవి రిజెక్ట్ చేసిన చిరంజీవి సినిమా మ‌రేదో కాదు `భోళా శంకర్`. మెహర్ రమేష్ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెల పాత్ర కోసం మొదట సాయి పల్లవిని సంప్రదించారట. కానీ స్టార్ కాస్ట్ కన్నా కథ‌, కథలోని పాత్రలకు సాయి పల్లవి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. అందులో భాగంగానే భోళా శంక‌ర్ క‌థ విని నో చెప్పింది. దాంతో చిరంజీవి సిస్టర్ గా సాయి పల్లవికి బదులు కీర్తి సురేష్ ను తీసుకున్నారు.


క‌ట్ చేస్తే భారీ అంచనాల నడుమ విడుదలైన భోళా శంకర్ డిజాస్ట‌ర్ అయింది. సినిమా రిజ‌ల్ట్ చూశాక సాయి పల్లవి భోళా శంకర్‌ను వ‌దిలేయ‌డ‌మే మంచిదైంద‌ని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇక `లవ్ స్టోరీ` మూవీ ప్రమోషన‌ల్ ఈవెంట్‌కు గెస్ట్ గా హాజరైన చిరు.. భోళా శంక‌ర్‌ను సాయి పల్లవి రిజెక్ట్ చేసిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే సినిమాకు సాయి ప‌ల్ల‌వి నో చెప్పినందుకు తాను హ్యాపీగానే ఉన్నాన‌ని.. ఎందుకంటే ఆమె తన పక్కన చెల్లెలుగా కన్నా హీరోయిన్‌గా చేయాలని ఆశపడుతున్నాన‌ని, ఆమెతో కలిసి డాన్స్ చేయాలనేది త‌న‌ కోరికని చిరు పేర్కొన‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: