చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలామంది దర్శక నిర్మాతలతో హీరోయిన్ లతో అవమానానికి గురైనట్టు స్వయంగా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆరోజు షూటింగ్లో జరిగిన ఒక అవమానమే ఆయన్ని ఇంత పెద్ద స్టార్ ని చేసిందట. మరి ఇంతకీ ఆయనకు జరిగిన అవమానం ఏంటి అనేది చూస్తే.. క్రాంతి కుమార్ డైరెక్షన్లో చిరంజీవి న్యాయం కోసం అనే సినిమా చేశారు. అయితే ఈ సినిమా లో చిరంజీవి కంటే పెద్ద స్టార్స్ అయినటువంటి శారదా, జగ్గయ్య వంటి వాళ్ళు కూడా నటించారట. అయితే ఈ సినిమా షూటింగ్లో కోర్టు సీను కోసం షూటింగ్ జరుగుతుందట. అలా జరుగుతున్న సమయంలో జగ్గయ్య, శారద వంటి వాళ్ళు అక్కడే ఉన్నారట.


కానీ అసిస్టెంట్ వచ్చి పిలవడంతో వెంటనే కోర్టు బోన్ లోకి వెళ్లి నిల్చొని ఉన్నారట చిరంజీవి. అయితే చిరంజీవి అలా లేటుగా రావడం చూసిన డైరెక్టర్ క్రాంతి కుమార్ ఏంటి నువ్వేమైనా పెద్ద స్టార్ వి అనుకుంటున్నావా.. నిన్ను ఒకరు పిలిస్తేనే వస్తావా.. నీకంటే సీనియర్ నీకోసం వెయిట్ చేస్తూ ఉండాలా.. అంటూ అందరి ముందే అరిచేసాడట. అయితే ఆరోజు డైరెక్టర్ మాట్లాడిన మాటలకు సంబంధించి చిరంజీవి మనసు నొచ్చుకుందట. అలా అవమానంగా ఫీల్ అయిన చిరంజీవి షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళాడట.

కానీ ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక డైరెక్టర్ క్రాంతికుమార్ చిరంజీవి కి ఫోన్ చేసి సారీ వేరే వాళ్ళ కోపం మీ మీద తీశాను. ఏమనుకోకండి అని అన్నారట. అక్కడితో చిరంజీవి అవమానాన్ని మర్చిపోయినప్పటికీ డైరెక్టర్ అన్న నువ్వేమైనా పెద్ద స్టార్ వా అనే పదాన్ని గట్టిగా తీసుకున్నారట. ఆ తర్వాత ఎంతో కష్టపడి చివరికి స్టార్ హోదా దక్కించుకున్నారు. అయితే తనకు జరిగిన అవమానాన్ని బలంగా తీసుకొని స్టార్ ని అయ్యాను అంటూ చిరంజీవి స్వయంగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: