
అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టడం.. అదే టైమ్‌లో సుమ, శ్రీముఖి, అనసూయ, రష్మీ, రవి వంటి యాంకర్స్ హవా ఎక్కువ కావడంతో ఉదయ భాను కెరీర్ అనేది కాస్త డల్ అయింది. చాలా గ్యాప్ అనంతరం ఇప్పుడిప్పుడు మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ భాను సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు యాంకర్లు ఒక సిండికేట్ గా ఏర్పడి నాలాంటి వాళ్లకి ఛాన్సులు లేకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అలాగే యాంకర్ గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ వదులుకున్నానని.. అందులో అత్తారింటికి దారేది సినిమా కూడా ఉందని ఉదయభాను పేర్కొంది. `లీడర్` లో స్పెషల్ సాంగ్ చూసి త్రివిక్రమ్ గారు `జులాయి`లో టైటిల్ సాంగ్ కి నన్ను తీసుకున్నారు. ఆ తర్వాత `అత్తారింటికి దారేది` మూవీలోనూ స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించారు. పవర్ స్టార్ మూవీలో సాంగ్ అంటే చాలా ఆనందపడ్డాను. కానీ అది పార్టీ సాంగ్.. పైగా నాతో పాటు మరికొందరు హీరోయిన్స్ ఉంటారని చెప్పినప్పుడు మనం హైలెట్ అవ్వమని అనిపించింది. అందుకే పవన్ మూవీకి సున్నితంగా నో చెప్పానని ఉయద భాను చెప్పుకొచ్చింది. అయితే బన్నీ మూవీకి ఎస్ చెప్పిన ఆమె.. పవన్ మూవీకి నో చెప్పడం మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది.