తమిళంలో పేరు పొందిన శివ కార్తికేయన్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మదరాసి. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జామ్వాల్ ,మలయాళ నటుడు బీజు మీనన్, విక్రాంత్, రుక్మిణి వసంత్ తదితర నటినటులు ఇందులో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల  ముందుకు రాబోతున్నది. అయితే ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా పైన సెన్సార్ అధికారులు ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.


మదరాసి సినిమా స్టోరీ విషయానికి వస్తే తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియా, రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్ మధ్య జరిగేటువంటి  యాక్షన్ ప్యాక్డ్ డ్రామా చిత్రంగా ఉంటుందట. ఈ చిత్రంలో రఘు (శివ కార్తికేయన్) అనే యువకుడు పాత్రలో కనిపిస్తారు.. ఆ మాఫియాని ఎదిరిస్తూ ఉంటారు. వీటికి తోడు ఈ చిత్రంలో లవ్, పగ, ఫ్రెండ్షిప్, ప్రతీకారం, త్యాగం ఇలా రెండు గ్రూపుల మధ్య జరిగే ఎటువంటి సన్నివేశాలు హైలైట్ గా ఉంటుందట. మదరాసి సినిమా కన్నడ, మలయాళం, హిందీ ,తెలుగు, తమిళ్ వంటి భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు.


సుమారుగా రూ .200 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ అధికారులు వీక్షించగా సినిమాలకు సంబంధించిన కంటెంట్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తిని తెలియజేసిందని ఈ చిత్రంలో కొన్ని హింసాత్మకమైన సన్నివేశాలను, రక్తపాతంతో కూడిన సన్నివేశాల పై అభ్యంతరం తెలియజేశారని తెలుస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాలను, డైలాగులను కూడా మ్యూట్ చేశారని సమాచారం. మదరాసి చిత్రంలో లవ్, బ్రేకప్, సెంటిమెంట్ యాక్షన్స్ సన్నివేషాల వల్ల ఈ సినిమా నిడివి కూడా బారీగా పెరిగిపోయిందని.. సుమారుగా 2 గంటల 45 నిమిషాలు అంటే 165 నిమిషాల వరకు సినిమా ఉంటుందట. ఇటీవలే కాలంలో అత్యధికంగా వచ్చిన రన్ టైమ్ వచ్చిన  సినిమాగా నిలుస్తోంది మదరాసి సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: