
గత కొంతకాలంగా నటుడు దినేష్ మంగళూరు పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించగా ఈరోజు తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే దినేష్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారు. దినేష్ మంగళూరు కిరిక్ పార్టీ చిత్రంలో నటించినప్పటికీ.. కేజిఎఫ్ చిత్రంతోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు.
కేజిఎఫ్ చిత్రంలో డాన్ శెట్టి పాత్రలో అద్భుతంగా నటించిన ఈ నటుడు రెండవ భాగంలో కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఆ తర్వాత చార్లీ 777, వీర మదకరి వంటి చిత్రాలలో నటించారు. చంద్రముఖి ప్రాణసకి వంటి చిత్రాలకు కూడా ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. దినేష్ మంగళూరు చివరిసారిగా భువనమ్ గగనం చిత్రంలో కనిపించారు. తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. దినేష్ మంగళూరుది కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపురులో నివసిస్తూ ఉండేవారు. అయితే తన ఇంట్లోనే తుది శ్వాస విడిచినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు ఈ విషయం కన్నడ సిని పరిశ్రమలోనే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతున్నది.