టాలీవుడ్, కోలీవుడ్లో  స్టార్ హీరోగా పేరుపొందిన కమలహాసన్ ఆయన నట వారసురాలుగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇటీవలే రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో శృతిహాసన్ ప్రీతి అనే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల సమయంలో కూలీ సినిమా ప్రమోషన్స్ లో శృతిహాసన్, సత్యరాజ్  పాల్గొన్నారు. అందులో ఒక విషయాన్ని బయట పెట్టింది శృతిహాసన్.



సత్య రాజ్ మాట్లాడుతూ తన తండ్రి లాగే శృతిహాసన్  కూడా చాలా భాషలు నేర్చుకున్నదని.. కమల్ హాసన్ ఒక బెంగాలీ సినిమా చేశారని ఆ సినిమా కోసమే ప్రత్యేకించి బెంగాలి భాష నేర్చుకున్నాడని సత్యరాజ్ తెలుపగా.. ఈ విషయం పైన శృతిహాసన్ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. తన తండ్రి సినిమా కోసం భాష నేర్చుకోలేదని ఒక సీక్రెట్ ని బయట పెట్టింది. బెంగాలి నటి అపర్ణ సేన్ తో ప్రేమలో పడ్డారని ఆమె కోసమే తన తండ్రి బెంగాలి నేర్చుకున్నారనే విషయాన్ని శృతిహాసన్ తెలియజేసింది..


మా  నాన్న బెంగాలి భాష నేర్చుకోవడానికి ముఖ్య కారణం  బెంగాలి నటి అయిన అపర్ణ సేన్ తో ప్రేమలో ఉండడమేనని. ఆమెను ఆకట్టుకోవడానికి తన తండ్రి బెంగాలీ నేర్చుకున్నారని అదంతా సినిమా కోసం కాదని తెలిపింది. అయితే ఇన్ని రోజులు తెలియని విషయాన్ని శృతిహాసన్ బయటపెట్టిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కమలహాసన్ డైరెక్షన్లో వస్తున్న " హే రామ్" సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రాణి ముఖర్జీ పాత్ర పేరు కూడా అపర్ణ అయితే.. అపర్ణ సేన్ అని పెట్టారని ఆమె వెల్లడించింది. అపర్ణ సేన్ బెంగాలీలో స్టార్ నటీమణులలో ఒకరని ఆమె చిత్ర నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. 9 జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా అందుకోవడమే కాకుండా 1987లో పద్మశ్రీ కూడా అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: