తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన మిరాయ్ సినిమా నుంచి ఈ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో తేజ సజ్జా హనుమాన్ సినిమాను మించిన విజయాన్ని అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఏకంగా 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని  సమాచారం అందుతోంది.

సెప్టెంబర్ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే  ఈ సినిమాకు ఎలాంటి టికెట్ రేట్ల పెంపు ఉండబోదని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పెద్దగా పోటీ లేకుండానే థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం టికెట్ రేట్ల పెంపు లేకపోవడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ కానుందని చెప్పవచ్చు.

మిరాయ్ సినిమాను ఇతర భాషల్లో సైతం ప్రముఖులు రిలీజ్ చేస్తున్నారు.  అందువల్ల ఈ సినిమాకు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో రిలీజ్ దక్కబోతోంది. శ్రీరాముడికి సంబంధించిన విజువల్స్ వల్ల నార్త్ లో ఈ సినిమా చేసే మ్యాజిక్ మామూలుగా  ఉండదని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మిరాయ్ సినిమాకు మంచు మనోజ్ సైతం ఒక విధంగా ప్లస్ కానున్నారని చెప్పవచ్చు.

మిరాయ్  ట్రైలర్ చూశాక ఈ సినిమాను కచ్చితంగా చూడాలనే అభిప్రాయం ప్రేక్షకులకు సైతం కలుగుతోంది.  పీపుల్స్ మీడియా బ్యానర్ కు ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ దక్కనుంది. మరోవైపు ది  రాజాసాబ్ సినిమా సైతం వాయిదా పడిందని తెలుస్తోంది.  నిర్మాత విశ్వ ప్రసాద్ వచ్చే ఏడాది జనవరి నెల 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని చెప్పుకొచ్చారు. మిరాయ్  సినిమా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: