
ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉన్న సందర్భంగా ఈ సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ కాదనే వార్తలు మొదట వినిపించాయి. వాస్తవానికి ఈనెల 25న థియేటర్లో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ చేస్తున్నామని బాలయ్య కూతురు అలియాస్ ఈ చిత్ర నిర్మాత తేజస్విని ఒక ప్రకటన ద్వారా ఇటీవలే తెలిపారు. అయితే ఇప్పుడు సడన్ గా ఈ విషయం పైన బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి స్పందిస్తూ.. అఖండ 2 ఆలస్యం కావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటూ తెలియజేసింది. ఇటీవలే బాలకృష్ణ NBK -50 ఇయర్స్ వేడుకలలో సరదాగా ముచ్చటించిన బ్రాహ్మణి అఖండ 2 సినిమా నీవల్లే పోస్ట్ పోన్ అయిందంటూ ఫన్నీగా థమన్ మీద కామెంట్స్ చేసింది.
అఖండ 2 కోసం దేవాన్ష్ కూడా చాలా ఎదురు చూస్తున్నారని, కానీ నీ పని వల్లే ఇప్పుడు పోస్ట్ పోన్ అయిందంటూ తెలిపింది. ఇదంతా కూడా ఫన్నీగా చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. బాలయ్య అఖండ 2 లో రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు బాలయ్య బర్త్డే కానుకగా విడుదలైన టీజర్ లో చూపించారు. అఖండ 2 ఓటీటి డీల్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి మరి.