రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఆయన కేవలం సినిమాలు తీయడమే కాదు, మార్కెటింగ్‌లోనూ ఓ మాస్టర్‌మైండ్. బాహుబలి, ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ విజయాల వెనుక ఉన్న అసలు సీక్రెట్ కంటెంట్ మాత్రమే కాదు, ఆయన ప్లాన్ చేసిన పబ్లిసిటీ గేమ్ కూడా. అదే స్ట్రాటజీని ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌కి అప్లై చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెన్యాలో మొదలైంది. అక్కడ దట్టమైన జంగిల్స్‌లో యాక్షన్ ఎపిసోడ్స్, సాహస సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అంతే కాదు, రెండు పాటలను కూడా అక్కడే షూట్ చేయాలనే ప్లాన్ ఉంది. మామూలుగా అయితే గోప్యంగా వెళ్లి పనులు పూర్తి చేసుకొచ్చేవాళ్లు. కానీ రాజమౌళి అలాంటివాడు కాదు. కెన్యా మంత్రులు, కీలక నేతలను కలవడం ద్వారా అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఈ మీటింగ్‌ల ఫోటోలు, వీడియోలు గ్లోబల్ మీడియాలో హైలైట్ అవ్వడంతో, ఒక్క పైసా ఖర్చు చేయకుండానే కోట్ల రూపాయల విలువ చేసే పబ్లిసిటీ తన సినిమాకి వచ్చేసింది.


ఇది రాజమౌళి మార్కెటింగ్ మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్. వంద కోట్లు పెట్టినా రాని ప్రమోషన్‌ని ఆయన కేవలం తన ఆలోచనలతో సులభంగా తెచ్చేశాడు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌తో హాలీవుడ్ తలుపులు తట్టిన రాజమౌళి, ఈసారి అక్కడే పాగా వేయాలని చూస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ మేకింగ్‌తో పోటీ చేసే విధంగా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నారు.ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ విషయానికి వస్తే, 1200 కోట్ల వరకు వెళ్తుందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ కొందరు అయితే “ఫస్ట్ పార్ట్‌కే 1000 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది” అని అంటున్నారు. అంటే రాజమౌళి – మహేష్ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని రేంజ్‌లో ఉండబోతోందని అర్థం.



ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలని రాజమౌళి టార్గెట్. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ లతో గ్లోబల్ స్టేజ్‌పై తన గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు దాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లి, టాలీవుడ్‌కి కొత్త గ్లోరీ తెచ్చే అవకాశం ఉంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఓ అడ్వెంచరస్ గ్లోబల్ హీరోగా కనిపించబోతున్నాడని టాక్. మొత్తానికి, కెన్యాలో ప్రారంభమైన ఈ యాక్షన్ జ‌ర్నీకి రాజమౌళి చేసిన పబ్లిసిటీ దెబ్బకి, ప్రపంచం అంతా ఇప్పుడు ఈ సినిమాకి కళ్ళప్పగించి చూస్తోంది. ఇది కేవలం సినిమా కాకుండా, ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచే ప్రాజెక్ట్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: