
పర్సనల్ ఇష్యూస్ కారణంగా అనుష్క డైరెక్టర్‌గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కనీసం ఫేస్ కూడా చూపించడం లేదు. కేవలం ఆడియో ద్వారానే ఇంటరాక్ట్ అవుతుంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇండస్ట్రీలో అనుష్కకు ఒక ఇమేజ్ ఉంది. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెను దృష్టిలో పెట్టుకుని కథలు రాసేవారు ఉన్నాయి. అయితే అనుష్క మాత్రం కథ, తన క్యారెక్టర్ నచ్చితే తప్ప సినిమాకు ఓకే చెప్పదు.
కానీ ఒకే ఒక్క హీరో విషయంలో మాత్రం క్యారెక్టర్ ఏదైనా పర్లేదు.. జస్ట్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలు అంటోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఘాటీ రిలీజ్ సందర్భంగా ఓ ఎఫ్ఎమ్ రేడియో ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్కను.. రేడియో జాకీ పవన్ కళ్యాణ్‌తో సినిమా గురించి ప్రశ్నించాడు. `నేను ఇండస్ట్రీలో అమితంగా ఇష్టపడేది ఇద్దరిని.. ఒకరు అనుష్క, మరొకరు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటివరకు మీ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఫ్యూచర్‌లో మీరిద్దరూ కలిసి నటించే ఛాన్స్ ఉందా?` అని ప్రశ్నించాడు.
అందుకు అనుష్క క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. `పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే నేను రెడీ. ఆయనతో కలిసి వర్క్ చేయడానికి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. అలాంటి ఛాన్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా నటిస్తాను. ఆయన చేసే పనులు నిత్యం అభిమానించే వ్యక్తుల్లో నేను ఒకరిని` అంటూ అనుష్క చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజంగా పవన్ కళ్యాణ్ అనుష్క కాంబినేషన్‌లో సినిమా సెట్ అయ్యిందంటే అది కచ్చితంగా ఫాన్స్ కి గుడ్ న్యూసే అవుతుంది. మరి అలాంటి తరుణం ఎప్పుడు వస్తుందో చూడాలి.