
అయితే మహానటి తర్వాత కీర్తి చేసిన సినిమాలలో అలాంటి క్రేజీ హిట్ దక్కలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తూ వరుసగా అలాంటి ప్రాజెక్ట్స్‌లో నటించింది కానీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలు రాలేదు. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా మళ్లీ సక్సెస్ కావొచ్చని ఆశతో ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తూనే వస్తుంది. కానీ ఈ వరుస ప్రయత్నాలన్నీ ఫలించకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కీర్తి సురేష్ మరోసారి ఉమెన్ సెంట్రిక్ సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు బయటకు రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. తమిళ ఇండస్ట్రీలో రూపొందనున్న ఓ చిత్రంలో కీర్తి ప్రధాన పాత్ర పోషించబోతోందట. ఈ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు ప్రవీణ్ ఎస్ దర్శకత్వం వహించనుండగా, డ్రం స్టిక్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. “సినిమాకు తీర్పు చెప్పలేము కానీ మలుపులు మాత్రం పక్కా ఉంటాయి” అంటూ ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.
కానీ ఈ ప్రాజెక్ట్‌లో కీర్తి సురేష్ నటించనుందన్న వార్తలు బయటకు రాగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు ఆమె కెరీర్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ, “పదే పదే అలాంటి సినిమాలే ఎంచుకుంటే ఎలా? ఒకసారి కొత్త కథలతో, వేరే కంటెంట్‌తో ప్రయోగాలు చేయాలి. నీ టాలెంట్‌కి సరిపడే పెద్ద సినిమాలు తీసుకోవాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ట్రోల్స్ చేస్తూ “కత్తిలాంటి బ్యూటీ ఉన్న కీర్తి సురేష్‌కు ఇలా పరిస్థితి రావడం ఏమిటి?” అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. సినీ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహానటి తర్వాత కీర్తి సురేష్‌కి ఉన్న క్రేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటే ఇప్పటికీ ఆమె స్థానం మరింత ఎత్తులో ఉండేదని అంటున్నారు. ఇప్పుడు ఆమె కెరీర్‌లో తిరుగుబాటు తీసుకురావాలంటే వేరే తరహా సినిమాలను ఎంచుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. మొత్తానికి, కీర్తి సురేష్ కొత్త సినిమా “డ్రామా” ఇప్పటినుంచే పెద్ద చర్చకు కారణమైంది. సినిమా హిట్ అవుతుందా? లేక మరోసారి ఆమెపై విమర్శల వర్షమే కురుస్తుందా? అన్నది చూడాలి. కానీ ఈసారి మాత్రం అభిమానులు చాలా సీరియస్‌గా ఆమె కెరీర్ మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.