ఈరోజుల్లో సినిమా ఇండస్ట్రీలో "బిగ్ స్టార్స్" అని చెప్పుకునే హీరోలు మూడు సంవత్సరాలకు ఒక సినిమా, నాలుగు సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ చేస్తేనే గర్వంగా ఫీలవుతున్నారు.  “వీఎఫ్ఎక్స్ టైమ్ పడుతుంది,” “భారీ బడ్జెట్ సినిమాలు” అంటూ సమాధానాలు ఇస్తూ అభిమానులను ఓపిక పట్టిస్తున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ కాలంలో హీరోల కష్టపాటు, డెడికేషన్, స్క్రీన్‌పై కనబడే ప్యాషన్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. సినిమా పట్ల ప్రేమ, కష్టపాటు ఉంటే ఏ స్థాయిలో రికార్డులు సృష్టించవచ్చో చూపించిన ఒక లెజెండరీ స్టార్ ఉన్నాడు. ఒకే ఏడాదిలో 10, 15, 20 సినిమాలు కాదు, ఏకంగా 36 సినిమాలు రిలీజ్ చేసి చరిత్ర సృష్టించాడు. నాలుగేళ్ల కాలంలో దాదాపు 139 సినిమాలు, ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా 150 సినిమాలు పూర్తి చేసి, ఇండియన్ సినిమా చరిత్రలో ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు నెలకొల్పాడు. ఈ స్థాయి కష్టపాటు, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడు అరుదు.


టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కెరీర్‌లో ఈ రికార్డుకు దగ్గరికి వచ్చినా, దాన్ని అందుకోవడం మాత్రం సాధ్యం కాలేదు. ఈ రికార్డు మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. అటువంటి రేంజ్‌లో సినిమాలు చేసిన ఈ సూపర్ స్టార్ 74 ఏళ్ల వయసులోనూ నటనలో అదే ఉత్సాహం, అదే ప్యాషన్‌తో సినిమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ లెజెండరీ స్టార్ జీవితం ఇప్పుడు విద్యార్థులకు ఒక స్ఫూర్తి ప్రదాతగా మారింది. ఆయన గాథ పాఠ్య పుస్తకాలలో చోటు సంపాదించింది. ఒక నటుడు కేవలం వినోదం ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదు, స్ఫూర్తి ఇచ్చే వ్యక్తిగా కూడా నిలవవచ్చని ఆయన నిరూపించారు. విద్యార్థులు, యువత ఆయన జీవితం నుండి పాఠాలు నేర్చుకోవాలని, ఆయన కష్టపడే మనసు తమలోనూ నింపుకోవాలని చాలా మంది సూచిస్తున్నారు.



మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ సూపర్ స్టార్ మరెవరో కాదు, “మెగాస్టార్ మమ్ముట్టి”. మమ్ముట్టి అనే పేరు వినగానే అభిమానులు అరుపులు, కేకలతో తమ అభిమానం వ్యక్తం చేస్తారు. 50 ఏళ్లకు పైగా సినీ ప్రయాణంలో 430కి పైగా సినిమాలు చేసి, ప్రతి పాత్రలో తన సత్తా చాటుతూ, మలయాళ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన హీరోగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. ప్రస్తుతం మమ్ముట్టి 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా అభిమానులు, సినీ ప్రముఖులు, సహచరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులతో నిండిపోయింది. ఈ వయసులో కూడా ఆయన తన ఆరోగ్యం, లుక్, నటన, పాత్రల ఎంపికలో చూపుతున్న శ్రద్ధ, డెడికేషన్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. బాక్సాఫీస్ వద్ద ఇంకా అదే రేంజ్‌లో విన్నర్‌గా నిలుస్తూ, యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్న మమ్ముట్టి నిజంగా ఒక లివింగ్ లెజెండ్ అని చెప్పుకోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: