- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కాంతారా: ఛాప్టర్ 1 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. అక్టోబర్ 2, 2025న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా యూనిట్ ఒక కీలక అప్‌డేట్‌ను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ఉన్న డిమాండ్ నేప‌థ్యంలో నైజాం థియేట్రికల్ రైట్స్‌ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ నిర్ణయం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.


కాంతారా: ఛాప్టర్ 1 ఒక దివ్య యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. కథలో మైథాలజికల్ టచ్, రిషబ్ శెట్టి ప్రత్యేక శైలి, అద్భుతమైన విజువల్స్ అన్నీ కలిపి ప్రేక్షకులకు ఒక మైమరిపించే అనుభూతి ఇవ్వబోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమా మీద ఆసక్తి రెట్టింపైంది. సంగీత దర్శకుడిగా అజనీష్ లోకనాథ్ పనిచేస్తున్నారు. గతంలో కాంతారా మొదటి భాగానికి అందించిన సంగీతం సూపర్ హిట్ కావడంతో, ఈసారి ఆయన నుంచి ప్రేక్షకులు మరింత గొప్ప మ్యూజికల్ అనుభూతిని ఆశిస్తున్నారు.


సినిమా కేవలం కన్నడలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు భారీగా స్క్రీన్లు కేటాయిస్తున్నారు. మొత్తం మీద కాంతారా: ఛాప్టర్ 1 రిషబ్ శెట్టి కెరీర్‌లో మరో గేమ్‌చేంజర్‌గా నిలిచే అవకాశం ఉంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, మైథాలజీ-యాక్షన్-డ్రామా మేళవింపుతో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేలా ఉన్నదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: