నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలి. రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా వైఎస్సార్ గారు నామకరణం చేశారు.  నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని  తీసుకువస్తే..మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్.ఎస్.ఎస్ వాదికి మద్దతు ఇచ్చారు? వైసీపీ అద్యక్షుడు జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా బీజేపీ అభ్యర్థికి జగన్ గారు మద్దతు ఇవ్వడం అవమానకరం అంటూ షర్మిల ఒకింత సంచలన కామెంట్లు చేశారు


టీడీపీ, జనసేన బహిరంగ పొత్తు. జగన్ గారిది తెరవెనుక పొత్తు. జగన్ గారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో BRS పార్టీ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉన్నారు. వైసీపీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. వైఎస్సార్ వారసుడు అయి ఉండి బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటు. వైఎస్సార్ తన జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు. వైఎస్సార్ బతికి ఉంటే జగన్ గారు చేసిన పనికి అవమానంతో, సిగ్గుతో తలదించుకునే వారు. చరిత్రలో వైఎస్సార్ ఛాతీలో కత్తితో పొడిచిన వాడుగా జగన్ గారు మిగిలిపోతారు. మీకు దమ్ముంటే బీజేపీ తోక పార్టీ అని ఒప్పుకోండి. చెయ్యెత్తితే కనిపించేలా బీజేపీ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోండి అంటూ షర్మిల విమర్శించారు.

అయితే కొడుకు పేరుతో షర్మిల రాజకీయాలు చేయడం తగునా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  ఇంటి పేరు విషయంలో ఇంత  హైరానా చేయడం రైటేనా అంటూ నెటిజన్లు కామెంట్లు  చేస్తున్నారు.  షర్మిల తీరులో మార్పు రావాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల రాజకీయాలలో సాధించేది ఏమీ ఉండదని నెటిజన్ల నుంచి  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయాలలో సక్సెస్ కావాలంటే కష్టపడటం అవసరం తప్ప ఇంటిపేరు కాదని మరికొందరు  అభిప్రాయపడుతున్నారు.  వైఎస్ షర్మిల  చేతులారా  చేస్తున్న తప్పులు పార్టీకి శాపంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: