
సమరసింహారెడ్డి.. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మరుపురాని సినిమాలలో ఇది కూడా ఒకటి. 1999 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టింది. 77 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించారు. సిమ్రాన్ , సంఘవి, అంజలా ఝవేరి హీరోయిన్లుగా నటించగా బి. గోపాల్ దర్శకత్వం వహించారు. అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులను సమరసింహారెడ్డి తిరగరాసింది. ఈ సినిమాలో ఎప్పటిలాగే బాలయ్య నటనలో తన విశ్వరూపం చూపించారు. రూ. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ఏకంగా రూ 15 కోట్ల షేర్ ను రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 227 రోజులు మూడు థియేటర్లలో, 175 రోజులు 29 కేంద్రాల్లో, 50 రోజులు 122 కేంద్రాల్లో ఆడి.. బాలయ్య కెరీర్ లోనే మరపురాని మైల్‌స్టోన్‌గా నిలిచింది.
సమరసింహారెడ్డి సినిమా తర్వాత బాలయ్య నటించిన నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమ సింహం సినిమాలు కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినవే. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ఇంద్ర, వెంకటేష్ జయం మనదేరా సినిమాలు కూడా రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కి హిట్ కొట్టాయి. అయితే ఈ సినిమా కథ ముందుగా బాలయ్య కోసం రాసింది కాదట. డైరెక్టర్ బి. గోపాల్ మరో స్టార్ హీరోను ఈ కథలో హీరో అనుకున్నారనట. ఈ కథ మొదట విక్టరీ వెంకటేష్ దగ్గరకు వెళ్లగా.. వెంకీ తనకు సూట్ అవ్వదని... ఈ కథ బాలకృష్ణకు బాగా సరిపోతుందని స్వయంగా సూచించారట. దాంతో ఈ కథ బాలకృష్ణ వద్దకు వెళ్లగా.. ఆయన ఓకే చెప్పడంతో తెరకెక్కింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు