
వసూళ్ల విషయానికి వస్తే, ‘కిష్కింధపురి’ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. సుమారు ₹1.85 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసి సరిపెట్టుకుంది. అయితే రెండవ రోజు కలెక్షన్స్ మాత్రం కొంత ఊపందుకున్నాయి. వీకెండ్ కావడంతో, ప్రేక్షకులు హారర్ సినిమాపై ఆసక్తి చూపించారు. కొన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. రెండవ రోజు ఈ సినిమా సుమారు ₹2 కోట్ల మేర వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది మొదటి రోజు కంటే స్పష్టమైన జంప్ అని చెప్పాలి. సినిమా కంటెంట్ విషయానికి వస్తే, హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ సీన్స్, ఇంటెన్స్ సన్నివేశాలు ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన ప్రదర్శన ఇచ్చాడని అభిమానులు అంటున్నారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్‌లోని నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే అనుపమ పరమేశ్వరన్ పాత్ర కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది.
‘మిరాయి’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుండగా, ‘కిష్కింధపురి’ మాత్రం ఆ స్పీడ్‌ను అందుకోలేకపోయినా పాజిటివ్ టాక్‌ని సంపాదించింది. ఈ సినిమా హారర్ జానర్‌లో ఒక సరైన థ్రిల్లర్‌గా నిలిచింది. మంచి కథ, కట్టిపడేసే ట్రీట్మెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ సినిమాలను ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. మొత్తంగా చెప్పాలంటే, కిష్కింధపురి రెండవ రోజు వసూళ్లు పర్వాలేదు అనిపించాయి. వీకెండ్‌లో ఈ సినిమాకు మరింత కలెక్షన్ పెరిగే అవకాశం ఉంది. మిరాయి వంటి హై బడ్జెట్, హై హైప్ సినిమాకు పోటీగా వచ్చినప్పటికీ, కిష్కింధపురి తన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.