
గతంలో కార్తీక్ 'సూర్య వర్సెస్ సూర్య' మరియు 'ఈగల్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో కార్తీక్ కెరీర్ మీద కొంత అనిశ్చితి నెలకొంది. అయితే, 'మిరాయ్' సినిమా విజయం ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
'మిరాయ్' విజయం సాధించడంతో, ఇప్పుడు స్టార్ హీరోలు, పాన్ ఇండియా స్థాయిలో పనిచేస్తున్న హీరోలు కూడా కార్తీక్ ఘట్టమనేనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారేమో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక దర్శకుడికి ఒక పెద్ద హిట్ పడితే, దాని తర్వాత వచ్చే అవకాశాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. కార్తీక్ ఘట్టమనేని విషయంలోనూ అదే జరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 'మిరాయ్' విజయం ఆయన భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి.
మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తోంది. ఈరోజు చాలా థియేటర్లలో ఈ సినిమాకు టికెట్స్ దొరకడం లేదు. ఇతర భాషల్లో సైతం ఈ సినిమా పుంజుకుందని తెలుస్తోంది. మిరాయ్ సినిమా ఓజీ సినిమా విడుదలయ్యే వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు