
ఈ నెల 18న ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అభిమానులు ఈ ట్రైలర్ కోసం చాలా ఉత్సుకతతో ఉన్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 20న జరగనుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తో పాటు సినిమా టీం సభ్యులు పాల్గొంటారు.
ఈ సినిమాలో నేహా శెట్టి ఒక కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆమె ఒక పాటలో, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. 'డీజే టిల్లు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టికి ఈ సినిమాతో మరింత పెద్ద సక్సెస్ దక్కుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
'ఓజీ' చిత్రం ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరొక మైలురాయి అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఓజీ సినిమా బుకింగ్స్ త్వరలో మొదలుకానున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ రేట్లు 1000 రూపాయలుగా ఉండవచ్చని తెలుస్తోంది. ఓజీ సినిమా రికార్డులు చేయాలనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు