
తెలంగాణలోని కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. మిగిలిన జిల్లాల్లో సైతం మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్ప పీడన ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడటంతో, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. పొలాల్లో నీరు నిలవడంతో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల వల్ల రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి మారితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నైరుతి తిరోగమనంతో ఇకపై వర్షాలు కురిసే అవకాశాలు తగ్గనున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు