
ఇక తాజాగా, చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి “మన శంకర వరప్రసాద్” పండగకి వచ్చేస్తున్నాడు అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ లో హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం, ఐటమ్ సాంగ్‌లో ఒక సీనియర్ బ్యూటీకి డ్యాన్స్ చేయించాలనే నిర్ణయం తీసుకున్నారట చిరంజీవి. నిజానికి ఆ పాటలో యంగ్ బ్యూటీస్ పేర్లు, పూజా హెగ్డే, తమన్నా వంటి నటీనటుల ల చేత చిందులు వేయించాలి అని అనుకున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. కానీ చిరంజీవి “ట్రెండ్ సెట్టర్”గా ఉండాలి అనే ఐడియాతో ఈ ఐటమ్ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్స్ చేత డ్యాన్స్ చేయించాలి అనుకుంటున్నారట. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ విభిన్నమైన ఆలోచనకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.
ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి సీనియర్ హీరోయిన్స్ ఎవరు బాగుంటారో అనేది ఆలోచనలో ఇప్పుడు చిత్ర బృందం పడ్డింది. ప్రస్తుత లిస్టులో రమ్యకృష్ణ, మీనా, టబు, ఖుష్బు స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా ఉన్నాయి. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఒక్కవేళ ఇదే గనుక నిజం అయితే ఇండస్ట్రీలో ఇది ఒక సెన్సేషన్ అవుతుంది అని చెప్పాలి. ఇక యంగ్ బ్యూటీస్ కి బొమ్మ పడిపోయిన్నట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి ఈ ఐడియా ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..???