పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన కెరియర్లో గ్యాంగ్ స్టార్ పాత్రల్లో నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించిన సినిమాలు చాలానే ఉన్న ఆయనకు ఆ జోనర్ సినిమాల ద్వారా హిట్లు మాత్రం పెద్దగా దక్కలేదు అని చెప్పాలి. ఆయన కెరీయర్లో మొదటగా బాలు అనే సినిమాతో గ్యాంగ్ స్టార్ పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయిన ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలోని పవన్ నటనకు మాత్రం అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

సినిమా తర్వాత పవన్ "పంజా" సినిమాలో కూడా ఇలాంటి పాత్రలోనే నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక పంజా సినిమా తర్వాత పవన్ గ్యాంగ్ స్టార్ సినిమాలో నటించడానికి అత్యంత ఎక్కువ సమయం తీసుకున్నాడు. తాజాగా పవన్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాలో హీరో గా నటించాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని డి వి వి దానయ్య నిర్మించాడు.

సెప్టెంబర్ 25 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. చాలా కాలం తర్వాత పవన్ నటించిన గ్యాంగ్ స్టార్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లు గానే ఇప్పటివరకు ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలన్నీ కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అన్ని సూపర్ గా జరుగుతున్నాయి. సినిమాకు గనక మంచి టాక్ వస్తే ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk