బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా కిష్కిందపురి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈయన చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈయనకు మంచి విజయాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర దక్కడం లేదు. ఈయనకు చాలా కాలం క్రితం రాక్షసుడు అనే సినిమాతో మంచి విజయం దక్కింది. ఆ మూవీ తర్వాత ఈయనకి ఒక మంచి విజయాలు తక్కలేదు.

ఇకపోతే రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కిందపురి సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించడంతో ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మరో విజయం తక్కుతుంది అని చాలా మంది భావించారు. ఇకపోతే కిష్కిందపురి సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 4.30 కోట్లు , సీడెడ్ లో 82 లక్షలు , ఆంధ్రలో 4.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 9 రోజుల్లో 9.37 కోట్ల షేర్ ... 16.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో ఈ మూవీ కి 9 రోజుల్లో 1.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.12 కోట్ల షేర్ ... 20.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 10 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా ... ఇప్పటికే ఈ సినిమా 1.12 కోట్ల రేంజ్ లో లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss