టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ తాజాగా మీరాయ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. మంచు మనోజ్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 9 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల్లో ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం. అలాగే ఈ సినిమా ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను కూడా తెలుసుకుందాం.

9 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 19.83 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 4.82 కోట్లు , ఉత్తరాంధ్రలో 4.20 కోట్లు , ఈస్ట్ లో 2.36 కోట్లు , వెస్ట్ లో 1.46 కోట్లు , గుంటూరు లో 2.01 కోట్లు , కృష్ణ లో 2.12 కోట్లు , నెల్లూరులో 1.04 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9 రోజుల్లో ఈ మూవీ కి 37.84 కోట్ల షేర్ ... 60.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 9 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక లో 4.15 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.10 కోట్లు , ఓవర్సీస్ లో 13.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో 63.89 కోట్ల షేర్ ... 115.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 36 కోట్ల ఫ్రీ రిలీజ్ బిసినెస్ జరగగా ..  ఈ మూవీ 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమా 26.89 కోట్ల లాభాలను ప్రపంచ వ్యాప్తంగా అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: