మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి కళ్యాణి ప్రియదర్శిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగులో చాలా సినిమాల్లో నటించిన ఒకటి , రెండు సినిమాలతో మాత్రమే మంచి విజయాలను అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె లోక చాప్టర్ 1 అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. మలయాళం లో రూపొందిన ఈ సినిమా మలయాళం తో పాటు అనేక భాషలలో విడుదల అయింది.

మూవీ కి అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే దక్కింది. దానితో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి. అలాగే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున లాభాలను కూడా ఇప్పటికే అందుకుంది. మరి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ..? ఈ మూవీ ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది ..? ఇప్పటివరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టి ఎన్ని కొట్ట లాభాలను అందుకుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

ఇప్పటివరకు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.89 కోట్ల షేర్ ... 15.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 3.50 కోట్ల టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.39 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kp