
టీజర్ విషయానికి వస్తే.. మంటల ముందు నందు సిగరెట్ కాలుస్తూ చూపించారు.ఆ తర్వాత నందు చైల్డ్ సన్నివేశాలను చూపిస్తూ ఆవికా గోర్ అందాలను తనివి తీరా చూస్తున్నట్టుగా చూపించారు. అనంతరం ఆవికా పైన ప్రేమను మరింత చూపించడమే కాకుండా చాలా బోల్డ్ గా చూపించారు. నందును కాకుండా ఆవికా మరొక అబ్బాయిని ప్రేమిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామంటు ఏడుస్తూ చెప్పినప్పటికీ నందు వదలడు.. ఆవికా గోర్ ను వేధిస్తూ ఉంటారు. వాళ్లది ప్రేమ, నీది కోరిక అందుకే నువ్వు ఇక్కడున్నవని ఆవికా గోర్ చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉంది. ఇందులో కాస్త బోల్డ్ గానే నటించినట్టుగా కనిపిస్తోంది. నందు టీజర్ లో తన యాక్టింగ్ తో అద్భుతంగా నటించేసారని చెప్పవచ్చు.
ఈ టీజర్ లో చాలానే ట్విస్టులు కనిపిస్తున్నాయి. చివరిలో ఆవికా గోర్ ప్రేమ కోసం నందు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? అసలు అవికా గోర్ కి నందు ఎందుకు నచ్చదనే విషయం తెలియాలి అంటే సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రంలో శివాజీ రాజా, రవితేజ మహా ధ్యానం తదితర నటీనటుల నటిస్తున్నారు . త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించబోతున్నారు. అవికా గోర్ ఇటీవలే తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం అనంతరం విడుదల కాబోతున్న సినిమా కావడంతో మరి ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తానికి టీజర్ హైలెట్ అవుతోంది.