టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... ప్రకాష్ రాజ్ , శ్రీయా రెడ్డి , అర్జున్ దాస్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఇప్పటికే ఈ సినిమా భారీ ఎత్తున కలెక్షన్లను వసూలు చేసింది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను అక్టోబర్ 23 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఓ టీ టీ లో కూడా ఈ సినిమా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది అని పవన్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా ఓ టీ టీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటే పవన్ అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: