
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. రాజా సాబ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. థియేట్రీకల్, నాన్ థియేట్రీకల్ రైట్స్ కోసం చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ మక్కువ చూపుతున్నట్లు తెలియజేస్తున్నారు. అన్ని భాషలలో వేరువేరుగా బిజినెస్ డీల్ కుదుర్చుకుంటున్నట్లు సమాచారం .ఇప్పటికే రాజా సాబ్ సినిమాకి సంబంధించి డిజిటల్ రైట్స్ హిందీ వర్షన్ కి, దక్షిణాది భాషలకు వేరువేరుగా ఓటీటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగానే రాజా సాబ్ సినిమా హిందీ రైట్స్ కి రూ.100 కోట్ల రూపాయలకు పైగా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు వినిపిస్తున్నాయి. అలాగే హిందీ డిజిటల్ రైట్స్ కోసం ప్రాసెస్ జరుగుతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇక దక్షిణాది భాషలకు సంబంధించి ఓటిటి రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, మార్కెట్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఆంధ్ర, నైజాం లో రాజా సాబ్ సినిమా తెలుగు వర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ ఉన్నట్లు వినిపిస్తున్నాయి.. దీంతో రాజా సాబ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో లాభాలలోకి రావాలి అంటే రూ .200 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ఫ్రెండ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి.