
నువ్వే కావాలి సినిమా మొదట హైదరాబాద్‌లో మూడు థియేటర్లలో మాత్రమే విడుదలైంది. ఓడియన్, దిల్‌షుక్‌నగర్, కుకట్‌పల్లి. ఓడియన్ థియేటర్‌కి అప్పట్లో బ్యాడ్ రిపోర్ట్ ఉండేదట. రవి కిషోర్ స్వయంగా థియేటర్ సౌండ్ సిస్టమ్ మార్చి, సదుపాయాలను మెరుగుపరిచారు. మొదటి ఇరవై రోజులు చాలా స్లోగా స్టార్ట్ అయిన ఈ సినిమా, మెల్లగా వర్డ్ ఆఫ్ మౌత్‌తో బలమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆ సినిమా తిరుగులేని బ్లాక్‌బస్టర్‌గా మారింది.
మ్యూజిక్ డైరెక్టర్ కే. సీతారామశాస్త్రి అందించిన పాటలు సినిమాకు ప్రాణం పోశాయి. రామోజీరావు ప్రొడక్షన్‌కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఎక్కడా జోక్యం చేసుకోలేదని రవి కిషోర్ చెప్పారు. రూ.1.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రమే కాకుండా, ప్రేక్షకాదరణ పరంగా కూడా రికార్డులు సృష్టించింది. సుమారు మూడు కోట్ల మంది ఈ సినిమాను చూశారని అంచనా. వందో రోజు నాటికి ఓడియన్ కాంప్లెక్స్‌లోని అన్ని థియేటర్లలో ఈ సినిమానే ప్రదర్శించడం ఆ సమయంలో విశేషంగా నిలిచింది. ప్రేక్షకుల ఉత్సాహంతో థియేటర్లలో అద్దాలు పగిలాయని రవి కిషోర్ తెలిపారు. “ నువ్వే కావాలి ” తర్వాత యూత్ సినిమాల శైలిలో కొత్త ధోరణి మొదలైందని రవి కిషోర్ గుర్తుచేశారు.