
అయితే ఆ పాట కు వచ్చిన క్రేజ్ మీసాల పిల్లలకు రావడం లేదు. ఆ సినిమాలో రామచిలకవే సాంగ్ లో లుంగీతో వెంకీ .. పక్కా మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఐశ్వర్య రాజేష్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ తరం జనరేషన్ వారికి మీసాల పిల్ల సాంగ్ పెద్దగా కరెక్ట్ కాలేదు. పైగా ఈ పాటలో గతంలో విడిపోయిన భార్యాభర్తల మధ్య గొడవను చూపించారు. ఇది ఎందుకో క్లిక్ కాలేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో వివిధ కారణాలతో రాజకీయ కారణాలవల్ల మెగా హీరోల సినిమాలు అన్ని ట్రోలింగ్కు గురవుతున్నాయి. మెగా హీరోల సినిమాలకు సూపర్ డూపర్ టాక్ వస్తే తప్ప భారీ కలెక్షన్లు రావడం లేదు.
ఈ ట్రోలింగ్ వల్లే మెగా హీరోల సినిమాలు చాలావరకు ప్లాప్ అవుతున్నాయి మీసాల పిల్ల సాంగ్ , ట్యూన్ , బీట్ , లిరిక్స్ అన్నీ బాగానే కుదిరాయి. డ్యాన్స్ లో మెగాస్టార్ బాగానే చేశారు. నయనతార బుంగమూతి తో కనిపించింది. అయినా ఎందుకో గాని సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పాటకు వచ్చిన క్రేజ్ అయితే దేనికి రాలేదు అన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.