టాలీవుడ్ లో ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో ఎవరు ? అంటే కచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు అన్ని వరుసగా పాన్ ఇండియా స్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ సినిమాల కలెక్షన్లతో పాటు ప్రభాస్ తీసుకుంటున్న పారితోష‌కం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఆ మాటకొస్తే టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అత్యధిక పారితోషం తీసుకుంటున్న టాప్ త్రీ హీరోలలో ప్రభాస్ ఒకడు. అలాంటి ప్రభాస్ క్రేజ్ ఆకాశ శిఖరానికి చేరుకుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ విషయంలోనూ రెమ్యునరేషన్ విషయంలోనూ ప్రభాస్ ను క్రాస్ చేస్తున్నాడా అంటే అవుననే చర్చలు ఇండియన్ సినిమా వర్గాలలో వినిపిస్తున్నాయి.


అల్లు అర్జున్ ప్రస్తుతం త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్‌ అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కు ఏకంగా 175 కోట్ల రూపాయల పారితోష‌కం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అల్లు అర్జున్ - అట్లీ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం బన్నీ పారితోషం విషయంలో అస్సలు తగ్గకపోవడమే అని తెలుస్తోంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో బన్నీ .. అటు జవాన్ సూపర్ డూపర్ హిట్ అవడంతో అట్లీ రెమ్యూనరేషన్ల విషయంలో అసలు తగ్గట్లేదు అట‌.


అందుకే వీరిద్దరి పారితోష కాలపై చాలా చర్చ‌ల తర్వాత ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అలా ఈ సినిమాకు బన్నీకి 175 కోట్ల రూపాయల పారితోష‌కం ముడుతుంది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొత్తం 700 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. ఇందులో 260 కోట్ల రూపాయలను కేవలం గ్రాఫిక్స్ కోసం కేటాయించారట. అలాగే బన్నీ - అట్లీ - దీపిక ఈ సినిమాకు భారీగా పారితో తీసుకుంటున్నారు. సన్ పిక్చర్
బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: