సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు చాలా చక్కగా ఉంటాయి — చూడగానే ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. అలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి కూడా. కానీ కొన్ని కాంబోలు మాత్రం అనౌన్స్‌మెంట్ రాకముందే దారుణమైన టాక్‌ను క్రియేట్ చేసుకుంటాయి.ఇప్పుడు అలాంటి టాక్ క్రియేట్ చేసుకున్నది ప్రభాస్ నటిస్తున్న ‘సలార్ 2’ సినిమా. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా హీట్ అవుతోంది. రెబెల్ అభిమానులు అయితే ఆ డైరెక్టర్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు — తన టాలెంట్‌తో, తన ప్రత్యేకమైన దర్శకత్వ శైలితో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పోస్టర్స్ నుంచే అద్భుతమైన హైప్ క్రియేట్ చేసుకుని, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. దానిని ఎప్పుడో ప్రకటించారు కూడా.ఈ సినిమా సీక్వెల్‌ను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకురావాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో తీస్తున్న సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆ షూటింగ్‌కి మధ్యలోని గ్యాప్‌లో ప్రభాస్ సినిమాపై కూడా స్పెషల్‌గా వర్క్ చేస్తున్నారట.

ఇక ప్రభాస్ సినిమా కథలో సిస్టర్ సెంటిమెంట్‌ను ముందుకు తీసుకెళ్లాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఆ పాత్ర కోసం ఎంపికైన హీరోయిన్ ఎవరో కాదు — కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్న కృతి శెట్టి పేరు తెలిసిందే. కానీ ప్రభాస్ చెల్లి పాత్రలో ఆమెను చూడటం కొందరికి నచ్చడం లేదు. “కృతి శెట్టి ఆయన సరసన హీరోయిన్‌గా నటిస్తే బాగుంటుంది, కానీ చెల్లి సెంటిమెంట్ ఏంటి?” అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు కానీ, “ఇలా చేస్తే కృతి శెట్టీ కెరీర్‌కు డ్యామేజ్ అవుతుంది” అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఆమె కన్నడ బ్యూటీ కావడం వల్ల ఆ ఇష్టంతో ఈ ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడేమో అనేది టాక్.

అయితే అభిమానులు మాత్రం — “ఇస్తే హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలి, చెల్లి పాత్ర అంటే ఇమేజ్ మొత్తం డౌన్ అవుతుంది, అది కూడా ప్రభాస్ సినిమాలో అయితే ఇక చెప్పనవసరం లేదు!” అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ కాంబో గురించి రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కృతి శెట్టి శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఎంత హాట్ గా  నటించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇలాంటి సిస్టర్ క్యారెక్టర్‌ని ఆమె ఓకే చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు బిగ్ డౌట్. కొందరైతే “ఇలాంటి రోల్‌కు ఒప్పుకోకపోతేనే మంచిది” అంటున్నారు. చూద్దాం… చివరికి ఏం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: